రైతులందరికీ సాగునీటి ఫలాలు…

237
Re-engineering of Irrigation projects -KCRs noble initiative
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టు ప్రతిఫలాలు రైతులందరికీ అందాలంటే సమర్థ నీటియాజమాన్యం అవసరమని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రామ్‌ ప్రసాదరెడ్డి అభిప్రాయపడ్డారు. సమర్థ నీటియాజమాన్యంలో ఓపెన్ కాల్వలకి బదు లుగా పైప్‌ల నెట్‌వర్క్‌ ద్వారా నీటి పంపిణీ వ్యవస్థ అత్యుత్తమైనదని వివరించారు.

తెలంగాణలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం పరిశోధకులు, అధ్యాపకుల సదస్సులో ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నీటిపారుదల రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయనన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కోణాల నుంచి ఆలోచించి సీఎం కేసీఆర్ నీటిపారుదల ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ చేపట్టారని తెలిపారు.

tsipass

కోటి 25 లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలన్న పవిత్ర సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరించారు. అయితే ఈ బృహత్ సంకల్పం సత్ఫలితాలు ఇవ్వాలంటే నీటి సమర్థ యాజమాన్యం అత్యవసరమని ఆయన వివరించారు. ప్రాజెక్ట్లు పూర్తి అయిన తరవాత అందరూ వరి వంట పంటలనే సాగు చేయటంవల్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన ఆయకట్టుకి నీరు అందడంలేదని … కాల్వల చివరి రైతులకి సాగునీరే అందడం లేదని ఆయనన్నారు. అందుకే ప్రభుత్వాలు పైప్డ్ నెట్వర్క్ సిస్టమ్ గురించి
ఆలోచన చేయాలని సూచించారు. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమర్థ నీటియాజమాన్య పద్దతులు గురించి రైతాంగంలో విస్తృత అవగాహన కల్పించాలని శ్యామ్‌ ప్రసాదరెడ్డి సూచించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని కేంద్ర జలసంఘం చైర్మన్ వాటర్‌మ్యాన్‌ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్‌ కొనియాడారని ఆయన గుర్తు చేశారు. చివరకు రాజేంద్రసింగ్ ఒక చెరువు ఒడ్డున తన పుట్టినరోజు జరువుకోన్నారని శ్యామ్‌ప్రసాద రెడ్డి గుర్తుచేశారు.

దేశంలో ఎక్కడ ఏ సమావేశానికి వెళ్లినా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన నిర్మిస్తున్న నీటిపా రుదల ప్రాజెక్ట్లు, రైతుబంధు గురించే మాట్లాడుతున్నారని విశ్వవిద్యాలయం ఉపకులపతి డా వి.ప్రవీణ్ రావు అన్నారు. పరిశోధన ఫలితాలు రైతులచెంతకు మరింత చేరువ కావాల్సి ఉందని ఆయనన్నారు. ప్రొఫె సర్ జయశంకర్ సారు కూడా నిత్యం నీళ్లు, నిధులు, నియామకాల గురించే పోరాడారని అన్నారు. వ్యవ సాయ విద్యాకోర్సుల పాఠ్యాంశాల్లో నీటి పారుదల ప్రాజక్ట్ల రీ డిజైనింగ్, ప్రతిపాదిత పంటలు తదితర
అంశాల్ని చేర్చడానికి చర్యలు తీసుకుంటామని ఆయనన్నారు. నీరు అనేది రెండువైపులా పదునున్న కత్తి అని… నీటి సమర్థ యాజమాన్యం గురించి రైతాంగంలో మరింత అవగాహన పెంచడంలో విశ్వవిద్యా లయం పాత్ర కీలకం అని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా పికెటిఎస్ఎయు, గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ సంస్థల మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. బోధన, పరిశోధన రంగాల్లో కలిసి పనిచేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా||సుధీర్ కుమార్, పరిశోధన సంచాలకులు డా||జగ దీశ్వర్, గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ సంస్థ ఎం.డి. డి.వసంతకుమార్‌తో పాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisement -