నవభారత్‌ @ 2022

325
piyush
- Advertisement -

2022లో నవ భారత్‌ లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు కేంద్ర ఆర్ధికమంత్రి పీయూష్ గోయల్. పార్లమెంట్‌లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన గోయల్ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొన్నామని చెప్పారు.

అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సుస్థిర అభివృద్ధి,నాణ్యమైన ప్రమాణాలకు పెద్దపీట వేశామన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గడిచిన ఐదేళ్లలో భారత్‌ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు.ఫలితంగా దేశం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందన్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేశామని గత ప్రభుత్వాల కంటే మెరుగైన జీడీపీ సాధించామన్నారు గోయల్. పాలసీ పరాలసిస్ తొలగించామన్నారు. దేశం అభివృద్ధిలో వేగంగా పురోగమిస్తుందన్నారు.

వృద్ధిరేటులో 11వ స్ధానంలో భారత్ ప్రస్తుతం 6వ స్ధానానికి చేరుకుందున్నారు.

- Advertisement -