2020లో జరిగే ఐసీసీ టీ20 షెడ్యూల్ విడుదలైంది. ఆసీస్ వేదికగా జరిగే ఈ మినీ మహాసంగ్రామం కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐసీసీ మహిళా, పురుషుల టీ20 ప్రపంచకప్‌లను ఒకే ఏడాది, ఒకే వేదికగా నిర్వహించనుంది. మొదటగా మహిళా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. అనంతరం పురుషుల టీ20 ప్రపంచకప్ జరగనుంది.
ఆస్ట్రేలియా – భారత్‌ల మ్యాచ్‌తో మహిళల టీ20 టోర్నీ,ఆసీస్ – పాక్ మ్యాచ్‌తో పురుషుల టీ20 టోర్నీ ప్రారంభం కానున్నాయి. 2020 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు మహిళా టీ20 టోర్నీ 2020 అక్టోబర్ 24 నుంచి నవంబర్ 15 వరకు పురుషుల టీ20 టోర్నీ జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌లకు మెల్‌బోర్న్ వేదిక కానుంది.
మహిళల సూపర్-10:
గ్రూప్-ఏ:
ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, క్వాలిఫయర్-1
గ్రూప్-బీ:
ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, క్వాలిఫయర్-2
పురుషుల సూపర్-12:
గ్రూప్-1:
పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2
గ్రూప్-2:
భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, క్వాలియర్-3, క్వాలిఫయర్-4