వారిని చెప్పుతో కొట్టేరోజు వస్తుంది:నిర్మాత అశోక్

224
peta producer
- Advertisement -

సంక్రాంతి రిలీజ్ సినిమాల విషయంలో టాలీవుడ్‌లో నిర్మాతల మధ్య వివాదం తారస్ధాయికి చేరుకుంది. పేట ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత అశోక్ వల్లభనేని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దిల్‌రాజు,అల్లు అరవింద్ స్వార్థం వలన తమకు థియేటర్లు దొరకడం లేదని ఇలాంటి మాఫియాను ఎందుకు షూట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తాజాగా మరో అడుగు ముందుకువేస్తూ అల్లు అరవింద్, దిల్ రాజులను వారి ఆఫీసులకెళ్లి చెప్పులతో కొట్టే రోజు వస్తుందంటూ తీవ్ర పదజాలంతో మాట్లాడారు. దీంతో ఈ వివాదం ఇప్పట్లో సద్దుమనిగేలా లేదు.

ఇక అశోక్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్స్ దొరకడం లేదని.. తమిళ సినిమాలకు థియేటర్స్ ఎక్కడ నుండి వస్తాయని చెప్పారు. టంగ్ స్లిప్ అయ్యి.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే.. మంచిది కాదని హెచ్చరించారు.

- Advertisement -