పొల్లాచ్చిలో మహర్షి….

166
Maharshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం.

ఇటీవలె హైదరాబాద్ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుని ఫ్యామిలీ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ త్వరలో చిత్రయూనిట్‌తో చేరనున్నాడు. ఇప్పటివరకు ప్రధాన షెడ్యూళ్లు పూర్తికావడంతో తదుపరి షెడ్యూల్‌ను పొల్లాచ్చీలో ప్లాన్ చేస్తున్నారు. రెండు వారల పాటు ఇక్కడ షూటింగ్ జరుపుకుంటే మెజార్టీ టాకీ పార్ట్ పూర్తయినట్టేనని చిత్రయూనిట్ తెలిపింది.

ఏడాది ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు మహేష్‌. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి కలిసి నిర్మిస్తున్నారు. అందాల తార పూజాహెగ్డే ఈ చిత్రంలో మహేష్‌తో ఆడిపాడుతోంది.