సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. రేపటి నుండి వారం రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల నుండి 13 వరకు దుబాయ్‌తో పాటు యూఏఈలలో పర్యటించనున్నారు సీఎం.
దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొననున్నారు కేసీఆర్. ఆయన వెంట సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఐఏఎస్ అధికారులు అర్వింద్ కుమార్, జయేష్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు కొందరు సీఎం వెంట వెళ్లే అవకాశం ఉంది.
రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్‌లో పర్యటించనున్నారు కేసీఆర్. అంతేగాదు పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ తొలిసారి 2014లో సింగపూర్‌లో పర్యటించారు. ఆ తర్వాత చైనా, హాంకాంగ్‌లలో పర్యటించారు. తాజాగా దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం.

