రాకెట్ పట్టిన దీదీ..

239
Mamata Banerjee
- Advertisement -

రాజకీయాల్లో ప్రత్యర్థులను ఆటాడుకునే సీఎం ఆమె. పదవిలో ఎంత బిజీగా ఉన్న ఆరోగ్యాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరు. క్రమం తప్పకుండా వాకింగ్‌కు వెళ్లడం ఆమెకు అలవాటే. అలాంటి ఆ సీఎం మైదానంలోకి దిగారు.బాడ్మింటన్ బ్యాట్ పట్టారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ .

నూతన సంవత్సరం కానుకగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన మమతా బిర్‌భుమ్ జిల్లా బోల్‌పుర్‌లోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్‌లో రాకెట్ పట్టారు. రాజకీయాల్లోనే కాదు బ్యాడ్మింటన్‌ ఆటలోనూ తన స్టైల్ ను చూపించారు. మమత ఆడిన ఆటను తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో దీదీ షటిల్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

63 ఏళ్ల వయస్సులో హెల్దీగా..హుషారుగా షటిల్ ఆడిన దీదీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

- Advertisement -