సిరిసిల్లకు కేటీఆర్…

200
KTR Siricilla visit
- Advertisement -

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా సిరిసిల్లకు రానున్న కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు టీఆర్ఎస్ శ్రేణులు.

సిరిసిల్లలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్‌హాల్‌లో మండలాలవారీగా కార్యకర్తలతో సమావేశంకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తీరుపై సమీక్షించనున్నారు. ఉదయం 10 గంటలకు కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరి 12.30 గంటలకు సిరిసిల్లకు చేరుకోనున్నారు.

12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట, 1.30 గంటలకు గంభీరావుపేట, 2.30 గంటలకు ముస్తాబాద్, 3.30 గంటలకు తంగళ్లపల్లి, 4.30 సిరిసిల్ల టౌన్ కార్యకర్తలతో సమావేశమవుతారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -