నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇంత వరకూ ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన విక్రమ్ తో సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. బన్నీకి స్టోరీ నచ్చకపోవడంతో ఆప్రాజెక్ట్ ను కూడా మధ్యలోనే వదిలేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బన్నీ సినిమా చేయనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు త్రివిక్రమ్ స్క్రీప్ట్ వర్క్ కూడా రెడీ చేస్తున్నాడని సమాచారం.
ఫిలీం నగర్ వర్గాల్లో తాజాగా ఉన్న సమాచారం ప్రకారం బన్నీ మరోక దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గీత గోవిందం సినిమాతో పెద్ద విజయాన్ని సాధించిన పరుశురామ్ తో బన్నీ సినిమా చేయనున్నాడని సమాచారం. ఆయన తదుపరి సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండనుందని సమాచారం. ఇటివలే ఆయన అల్లు అర్జున్ కు కథ వినిపించారని ఆయనకు కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. పరుశురామ్ తో కనుక బన్నీ సినిమా చేస్తే..బన్నీ, త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లే లేకపోవచ్చనే అనుకోవాలి.