20న హోంమంత్రిగా బాధ్యతల చేపట్టనున్న మహమూద్‌ అలీ..

236
Mahmood Ali
- Advertisement -

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ హోంమంత్రిగా నియమితులైన మహమూద్‌ అలీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 20న రాష్ట్ర హోంమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

గురువారం నాంపల్లిలోని యూసుఫైన్‌ దర్గాలో మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన నేరుగా సచివాలయాని వెళ్లనున్నారు. అక్కడ డి బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

- Advertisement -