ఈనెల 12న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ..

93
kcr
- Advertisement -

ఈనెల 12వ తేదీన ప్రగతి భవన్‌లో మ‌ధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ స‌మావేశంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ధాన్యం కొనుగోళ్ల‌పై ఈ సమావేశంలో కీలక నిర్ణ‌యం తీసుకోనున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్ల‌ర్ల‌కు విక్ర‌యించే అంశం, ధాన్యం నిల్వ‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌రు కానున్నారు.

- Advertisement -