కేటీఆర్ గురి తప్పలేదు…

407
ktr
- Advertisement -

తెలంగాణలో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పినట్లే జరిగింది. ఏకంగా కాంగ్రెస్ మహామహులనే గల్లంతు చేస్తూ కారు పార్టీ దూసుకుపోతోంది. దాదాపుగా 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ 3 చోట్ల విజయదుందుభి మోగించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో కొత్త ప్రొఫైల్‌ ఫొటోను పెట్టారు. తుపాకీ పట్టుకుని గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోకు ఇప్పటికే 16 వేల లైక్‌లు, వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చాయి.

కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించారు నిర్మాత కోన వెంకట్‌. ‘ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్‌..ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. శుభాకాంక్షలు’ అని వెంకట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

- Advertisement -