మహేష్ మల్టీప్లెక్స్..ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్

279
rgv mahesh multiplex
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏసియన్ ఫిలింస్ సంస్థతో మహేష్ మల్టీఫ్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుండగా దీనికి ఏయంబీ(ఏషియన్ మహేష్ బాబు) సినిమాస్‌ అనే పేరును పెట్టారు. గచ్చిబౌలిలో నిర్మిస్తున్న ఈ థియేటర్‌ను చూడటానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

mahesh multiplex

డిసెంబర్‌ 2న ఈ థియేటర్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఏయంబీని సందర్శించారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడే ఏఎమ్‌బీ సినిమా స్ర్కీన్స్‌ చూశాను. డిసెంబర్‌ 2న ప్రారంభం కానుంది. బ్రీత్‌టేకింగ్‌ ఎక్స్‌పెరియన్స్‌ అంటూ ట్వీట్ చేశారు. మహేష్‌ ఎంత అందంగా ఉంటాడో థియేటర్‌ కూడా అంతే అందంగా ఉంది అంటూ ట్వీట్‌ చేశాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ థియేటర్‌ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -