భారీగా తగ్గిన పెట్రోల్‌-డీజిల్ ధరలు..

268
Petrol Price
- Advertisement -

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో.. దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు శుక్రవారం (నవంబరు 23) మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నాయి. దీంతో భరత్‌లో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుముఖం పడుతున్నాయి.

Petrol Price

నేడు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ ప్రకటించింది. నేడు లీటరు పెట్రోలుపై 40 పైసలు, డీజిల్ పై 41 పైసల మేరకు ధర తగ్గింది. దేశ రాజధానిలో పెట్రోలు ధర రూ. 75.57కు, ముంబైలో రూ. రూ. 81.50కి, కోల్‌ కతాలో రూ. 77.53కు, చెన్నైలో రూ. 78.46, హైదరాబాద్‌ లో రూ. 80.12కు ధర తగ్గింది.

ఇక డీజిల్ ధర న్యూఢిల్లీలో రూ. 70.56కు చేరగా, ముంబైలో రూ. 73.91గా, కోల్‌ కతాలో రూ. 72.41గా, చెన్నైలో రూ. 74.55గా, హైదరాబాద్‌ లో రూ. 76.77గా ఉంది. ఇక అక్టోబర్ 18 నుంచి పెట్రోలు ధరల తగ్గుదల ప్రారంభం కాగా, ఇప్పటివరకూ 36 రోజుల్లో మొత్తం రూ. 8.43 మేరకు పెట్రోలు ధర తగ్గింది.

- Advertisement -