టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘టెంపర్’. ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ అనే టైటిల్‌తో రీమేక్ అవుతుంది. ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.
ఈ మూవీ పోస్టర్‌లో విశాల్ బీర్ బాటిల్ పట్టుకొని ఉంటాడు. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఈ పోస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ నాడులోని పీఎంకె పార్టీ నాయకుడు డా. ఎస్. రామదాస్ విశాల్ పోస్టర్‌ను విమర్శిస్తూ అయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా రాశారు.
“విశాల్ నటించిన అయోగ్య సినిమా నుంది బీర్ బాటిల్ పట్టుకుని ఉన్న పోస్టర్‌ను వెంటనే తొలగించాలి. విశాల్ ఈ పోస్టర్ ద్వారా ఏం సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారు? నడిగర్ సంఘం సెక్రటరీగా ఆయన మరింత సామాజిక భాద్యతతో ఉండాలని నేను ఆశిస్తున్నాను”. “అయన నడిగర్ సంఘం అధ్యక్షుడు కాబట్టి నేను గతంలో ఆయనకు సినిమాల్లో స్మోకింగ్ సీన్లు నిషేధించాలా చర్యలు తీసుకోవాలని ఒక లెటర్ కూడా రాశాను. ఇప్పుడు ఆయనేమో మరో అడుగు ముందుకేసి చేతిలో బీరు బాటిల్‌తో వచ్చాడు. ఇదా అయన సామాజిక బాధ్యతను చూపించే విధానం!!!” అని ఆయన పేర్కొన్నారు. మరి ఈ వివాదంపై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.