ఉప ఎన్నికల బరిలో భారతీయుడు..

287
Kamal haasan
- Advertisement -

తమిళనాడులో త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు సినీ నటుడు,మక్కల్ నీది మయ్యమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్‌. ఉప ఎన్నికలు జరిగే 20 స్థానాల్లో పోటీ చేస్తామని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని తెలిపారు.

జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. టీటీవీ దినకరన్‌కు మద్దతు తెలిపిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీనిని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అలాగే, కరుణానిధి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మృతితో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం 20 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

  kamal political party

ఉప ఎన్నికల ఫలితాలపై పళనిస్వామి – పన్నీర్‌ సెల్వం ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రస్తుతం తమిళనాడులో 234 స్థానాలు ఉండగా డీఎంకేకు మిత్ర పక్షాలతో కలిపి 97 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అధికార అన్నాడీఎంకేకు స్పీకర్‌తో కలిపి 116 స్థానాలు ఉన్నాయి. దీంతో ఇరు పార్టీలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.

- Advertisement -