టాలీవుడ్‌లో రికార్డులు సృష్టించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని బాలీవుడ్- కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ప్రేమకథా చిత్రాల్లో ఈ సినిమా ఒక కొత్త ట్రెండను సృష్టించింది. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే తమిళంలో ప్రముఖ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘వర్మ’ పేరుతో నిర్మిస్తున్న ఈ మూవీకి బాలా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న ఈ మూవీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా కియారా అడ్వానీ కథానాయిక. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే హిందీ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈరోజు సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు ‘కబీర్ సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషన్ కుమార్, అశ్విన్ వర్దే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2019 జూన్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.