సిడ్నీలో అంబరాన్న౦టిన బతుకమ్మ సంబరాలు..

303
- Advertisement -

సిడ్నీ బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF)మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయ. సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వయించిన బ‌తుక‌మ్మ ఆటా…పాటతో, సిడ్నీ నగరం పుల‌కించింది..!! ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి.

బ‌తుక‌మ్మ బ‌తుక‌మ్మ ఉయ్యాలో….బంగారు బతుక‌మ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాట‌లు పాడారు.. స‌ప్త‌వ‌ర్ణాల శోభిత‌మైన పూల‌దొంత‌ర‌ల బ‌తుక‌మ్మ‌లు చూడ‌ముచ్చ‌టేశాయి. వాటి త‌యారీకి ఉద‌యం నుంచే క‌ష్ట‌ప‌డ్డారు. ఉత్త‌మ బ‌తుక‌మ్మ‌ల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేశారు. వాటిని త‌యారు చేసిన మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ప్రధానం చేశారు. మ‌నసంతా తెలంగాణ‌పైనే వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. తెలంగాణ ఎన్నారైల మ‌న‌సుంతా తెలంగాణ పైనే ఉంటుంద‌న్నారు సిడ్నీ బతుకమ్మ అధ్యక్షుడు అనిల్ మునగాల తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను, ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తుండ‌టం ఇక్క‌డే పుట్టి పెరిగిన పిల్ల‌ల‌కు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియ‌జెప్ప‌డమే సంస్థ ముఖ్య ఉదేశ్యంని తెలిపారు.

Bathukamma Celebrations

మానవ సంబంధాలు నిలబెట్టి, కొత్త జీవన స్ఫూర్తిని నింపే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు గొప్ప ఊరట. ఇటువంటి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మను సిడ్నీ నగరంలో ప్రవాస తెలంగాణవాసులు కన్నుల పండుగగా జరుపుకున్నారు. వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉయ్యాల పాటలు పాడి ఆడారు. బతుకమ్మ ఆటపాటలతో పరిసరాలు మార్మోగాయి. అందరూ ఒక్కచోట కూడి ఇలా బతుకమ్మను వేడుకగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని SBDF నిర్వాహాకుల చైర్మన్ రామ్ రెడ్డి గుమ్మడవాలి తెలిపారు.

ఈ బతుకమ్మ సంబురాల్లో సుమారు 1700 నుండి 2000 మంది వరకు పాల్గొన్నారు. మంగ్లీ తన బతుకమ్మ పాటలతో అందరిని ఆకర్షించింది ,తెలంగాణ జానపద గీతాలతో గోరెటి వెంకన్న మరియు జంగి రెడ్డి జనాలను ఊరుతులు వూగించారు.ప్రవాస తెలంగాణవాసులే కాకుండా.. పంజాబీలు, చైనీయులు, తమిళులతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన వారు పాల్గొని బతుకమ్మ వేడుకలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సాంప్రదాయ వేషధారణకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.ఈ కార్య‌క్ర‌మంలో కౌన్సిల‌ర్ జూలియా ఫిన్ , హుగ్ మక్డ్రాట్, సూసై బెంజమిన్, బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఇండియ‌న్ హై క‌మిష‌న్ కార్య‌ద‌ర్శి శ్రీ స్.కే. వర్మ వేడుక‌లు పూర్త‌య్యేంత వ‌ర‌కూ ఉన్నారు. ఈ బతుకమ్మ వేడుకలకు సమన్వయకర్తలుగా రామ్ రెడ్డి గుమ్మడవాలి, సుమేషు రెడ్డి సూర్య, శశి మానేం, గోవెర్దన్ రెడ్డి, హారిక మానేం, కవిత రెడ్డి, ప్రశాంత్ కడపర్తి , వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో సునీల్ కల్లూరి, మిథున్ లోక, వినయ్ యమా, ప్రదీప్ తెడ్ల, అనిల్ మునగాల, సందీప్ మునగాల, హారిక మన్నెం, వాత్సహాల ముద్దం, కిశోరె రెడ్డి, నటరాజ్ వాసం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రమోద్ రెడ్డి, వాసు టూట్కుర్, లతా కడపర్తి, సాయి కిరణ్ చిన్నబోయిన, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల, వినోద్ ఏలేటి, వినయ్ కుమార్, కిశోరె యాదవ్, కిరణ్ అల్లూరి, పద్మిని చాడ, సంగీత కోట్ల, రాజేష్ అర్షణపల్లి, పాపి రెడ్డి, అశోక్ మాలిష్, ఇంద్రసేన్ రెడ్డి, ప్రమోద్ ఏలేటి, కావ్య గుమ్మడవాలి మరియు ఇతర సంగాల అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -