బాబు ఆచూకీ చెబితే లక్ష నజరాన:ఆర్జీవీ

355
rgv ntr biopic
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఈనెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని ఆర్జీవి ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే.. తాజాగా తన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అచ్చం చంద్రబాబు లాగే ఉన్న ఓ వ్యక్తి వీడియో పెట్టి.. అతను ఎవరో చెప్పాలంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. అతనెవరో చెప్పిన తొలి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి కూడా ఇస్తానని  ప్రకటించారు.

దీంతో ఆర్జీవీ తెరకెక్కించనున్న ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు ఇతనే అనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ గా ఉండే వర్మ తాను తీసే సినిమాలు,ఆ సినిమాల్లో క్యారెక్టర్స్ కూడా అచ్చం నిజ జీవితంలో వారి పాత్రలు ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అలాగే ఉండేలా జాగ్రత్త పడతారు. ఈ నేపథ్యంలో చంద్రబాబులా కనిపిస్తున్న వీడియోలోని వ్యక్తి సమాచారం ఆర్జీవీకి తెలిస్తే…లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నటించడం ఖాయమని పలువురు చెబుతున్నారు.

జీవి ఫిలిమ్స్ బ్యానర్ పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందుతోంది.  దసరాకు ప్రారంభంకానున్న ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది. సినిమా ప్రారంభం రోజు మీరు ఉహించని వ్యక్తులు వస్తారని వర్మ చేసిన ట్వీట్ సినీవర్గాల్లో హీట్ పెంచేసింది.

- Advertisement -