కాంగ్రెస్‌కు దమ్ము లేదు-నాయిని

276
- Advertisement -

తనపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. రేవంత్ రెడ్డి అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన నాయిని  కొడంగల్ లో రేవంత్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వంద సీట్లు ఖాయమని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే.. కూటమి కట్టిందని నాయిని పేర్కొన్నారు.

పొరపాటున గత ఎన్నికల సందర్బంగా రూ. 5,10 లక్షలో కేసీఆర్ ఇస్తారన్నారనే బదులు రూ. 10 కోట్లు అన్నానని నాయిని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని.. గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని వెల్లడిస్తే.. ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ప్రోత్సహిస్తే.. కాంగ్రెస్ పార్టీకే నష్టమని.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నందుకు ఆ పార్టీకి ప్రజలే   శిక్ష వేస్తారని తేల్చిచెప్పారు.

రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని నాయిని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే రైతులకు పెట్టుబడి సాయం చేసిన పాలకులు లేరని.. కానీ సీఎం కేసీఆర్ ఎకరానికి రూ. 8వేలు ఇస్తూ రైతన్నలను ఆదుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని.. ఓటరు లిస్టు విషయంలో కాంగ్రెస్ కు కోర్టు గట్టి బుద్ది చెప్పిందని తెలిపారు.

- Advertisement -