భారత్-విండీస్ మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండోటెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది విండీస్. ఫాస్ బౌలర్,కెప్టెన్ జానస్ హోల్డర్ తిరిగిజట్టులో చేరారు. మ్యాచ్ ని ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టేడియానికి వస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ తో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది.
స్టేడియం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటే, స్కూలు పిల్లలను తరలించేందుకు హెచ్సీఏ ఏర్పాట్లు చేసింది.
షమీ స్థానంలో శార్ధూల్‌ని ఎంపిక చేయగా, ఇతనికి తొలి టెస్ట్. ఇక వెస్టీండీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇప్పటికే వెస్టిండీస్ తో రాజ్ కోట్ లో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి ఊపుమీదున్న భారత్, రెండో మ్యాచ్ ని కూడా గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉండగా, తమ సత్తా చాటి భారత్ కు షాకివ్వాలని విండీస్ భావిస్తోంది.
భారత్ : కోహ్లి (కెప్టెన్), పృధ్వీషా, కెఎల్ రాహుల్, పుజారా, రహానే, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్, కుల్దీప్
వెస్టిండీస్ : హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్, షై హోప్, ఆంబ్రిస్, హెట్‌మెయర్, ఛేజ్, డౌరిచ్, రోచ్, బిషూ , గాబ్రియెల్