కొండంత ధైర్యాన్నిచ్చారు:ఎన్టీఆర్

258
ntr trivkram
- Advertisement -

ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ప్రీమియర్‌ షో నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ మార్కెట్‌లో సైతం ఎన్టీఆర్ సత్తాచాటాడు.

సినిమాకు పాజిటివ్ టాక్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ లేక‌పోతే ఈ విజ‌యం సాధ్యం కాద‌ని అన్నారు.

ఇలాంటి స‌మ‌యంలో కొండంత ధైర్యాన్ని అందించిన అభిమానుల‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. అదే విధంగా చిత్ర‌యూనిట్‌కి, మీడియాకి , సినిమాని స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్ చెప్పారు ఎన్టీఆర్‌. సినిమాని త‌మ భుజాల‌పై మోసి ఇంత‌టి విజ‌యాన్ని అందించారని తెలిపారు.

యూఎస్‌లో 218పైగా స్క్రీన్‌లలో ప్రిమియర్ షోలను ప్రదర్శించారు. $ 791,021 (రూ. 5.85 కోట్లు) రాబట్టింది. ఎన్టీఆర్ గత చిత్రాల వసూళ్ల రికార్డులను తిరగరాసింది అరవింద సమేత.ఫ్యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు అభిమానుల ఆద‌రాభిమానాలు అందుకుంటుండంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -