బంగారు తెలంగాణే ధ్యేయంగా టీఆర్ఎస్‌ మేనిఫెస్టో..

245
mp viond
- Advertisement -

బంగారు తెలంగాణే ధ్యేయంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో సిద్ధమవుతోంది. కేకే చైర్మన్‌గా ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీకి వినతులు వెల్లువలా వస్తున్నాయి.ఇప్పటికే వివిధ సంఘాల నాయకులు కేకేని కలిసి వినతిపత్రం సమర్పించగా తాజాగా బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు.

బీసీ ప్రజాప్రతినిధులు గత డిసెంబర్‌లో రూపొందించిన బీసీ డిక్లరేషన్‌లోని అంశాలను టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో చేర్చాలని కృష్ణయ్య కోరారు. రూ.20వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకొన్న ప్రతిఒక్కరికి 90 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని కోరారు. బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలిగించాలని కోరారు.

దళితులకు కొత్తగా వివిధ పథకాలను అమలుచేయాలని కోరుతూ రాష్ట్ర ఆహార భద్రత చట్టం సభ్యుడు ఆనంద్ వినతిపత్రం సమర్పించారు. దళితులకు మూడు ఎకరాల భూమి కొనుగోలు పథకంలో భాగంగా ఒకవేళ భూమి లభ్యం కాకుంటే దళితులకు స్వయం ఉపాధికి 50 శాతం సబ్సిడీతో గ్రామాలవారీగా రుణాలు ఇవ్వాలని కోరారు.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తెలంగాణ శాఖ, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఇంటలెక్చువల్ ఫోరం సంయుక్తంగా కేకేకు వినతిపత్రం సమర్పించాయి. ఎస్సీ, ఎస్టీ రైతులు, కౌలు రైతులకు అర్హత పరిమితిని 70 సంవత్సరాల వరకు పెంచాలని కోరాయి.

- Advertisement -