‘ఆర్ ఎక్స్ 100’ హీరోతో ‘హిప్పీ’..

337
- Advertisement -

ఇటీవల కాలంలో యూత్ మనసులను ఎక్కువగా కొల్లగొట్టేసిన చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’. చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో హీరో కార్తికేయ మంచి క్రేజ్‌ సంపాధించుకున్నాడు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా రెండో సినిమాగా ‘హిప్పీ’ తెరకెక్కబోతోంది. టి.ఎన్‌.కృష్ణ దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాత క‌లైపులి.య‌స్‌.థాను నిర్మిస్తున్నారు.

Hero Karthikeya New Movie

ఈ రోజు (శుక్ర‌వారం) కార్తికేయ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ‘హిప్పీ’ టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం వాళ్ల ఎంపికకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మరి ఈ మూవీ ఏ స్థాయిలో విజయం అందుకుంటుందో చూడాలి.

- Advertisement -