రమ్యకృష్ణ మీకు ముందుగా బర్త్‌డే విషెస్.. ఈ పుట్టనరోజు కానుకగా శైలజారెడ్డి అల్లుడు మంచి విజయాన్ని సాధించటం ఎలావుంది.?
మీకు ధన్యవాదాలు.. ఈ పుట్టినరోజుకి ఒక మంచి చిత్రం సూపర్ హిట్ అవ్వటం చాలా ఆనందంగా వుంది. అలాగే ఈ చిత్రంలో అందరూ చాలా జెన్యూన్‌గా కష్టపడ్డారు.. వారందరికి నా ప్రత్యేఖ శుభాకాంక్షలు.
శైలజారెడ్డి అల్లుడు చిత్రం చూసిన వారంతా మీ పాత్ర కొసం ప్రత్యేఖంగా మాట్లాడుకుంటున్నారు.. ఈ రెస్పాన్స్ మీద మీ కామెంట్.
డెఫినెట్‌గా శైలజారెడ్డి పాత్ర వైవిధ్యంగా వుంటుంది. ఒక సైడ్ ఊరులో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఏంతవరకైనా పోరాడే ధీరత్వం.. మరో వైపు తల్లిగా కూతురు మీద ప్రేమ.. సమస్య వస్తే ఎదుర్కునే ధైర్యం ఇన్ని వున్నాయి శైలజారెడ్డి పాత్రలో.. మారుతి ఈ పాత్రని మలిచిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రంలో అత్త పాత్ర రెగ్యులర్‌గా ఉండదు.. మీరు ఎప్పూడూ చూస్తున్న అత్త అల్లుళ్ళ మద్య కామెడి కూడా ఈ చిత్రంలో కనిపించదు. చూసిన వారికి, చూసేవారికి స్వీట్ సర్పరైజ్లా వుంటుంది.
ఈ చిత్రంలో మీది ఇగో కేరక్టర్ కదా..?
అది ఓ పక్క వుంటుంది,. కాని సీన్స్ అన్ని కొత్తగా వుంటాయి. చాలా బాగుంటాయి.. కొత్త అత్త, అల్లుడ్ని చూస్తారు. ఈ చిత్రంలో…
ఇక్కడ అత్తకి ఇగోనే కూతురికి ఇగోనే పాపం అల్లుడు కదా.. అల్లుడు మీద జాలి వేయలేదా మీకు..?
హహహ.. నిజం అండి అత్తగా నాకు ఇగో, కూతురికి ఇగో ఇక్కడ వరకూ నేను ఎంజాయ్ చేశాను.. సేమ్ నాలాంటి పాత్ర ఇంకోకటి నాకు తోడుగా వుంది అని పాపం చైత్యన్యకి మాత్రం ఫుల్ టెన్షన్ వుంది.. కాని మీరు చూస్తే ఇవన్ని ఫన్ జెనెరేట్ చేస్తాయి. మా ముగ్గురి మద్యలో నరేష్, మాణిక్యంగా ఫృధ్వి, వెన్నెల కిషోర్ కేరక్టర్స్ కామెడిగా వుంటాయి.. కొన్ని సార్లు కామెడికి షూట్ కూడా ఆపేసి నవ్వేవాళ్ళం.. నేను బాగా ఎంజాయ్ చేశాను.
మీరు నాగార్జునతో చేశారు.. ఇప్పడు నాగచైతన్యకి అత్తగా చేశారు.. చైతన్య యాక్టింగ్ ఎలావుంది..?
చాలా హ్యపిగా వుంది. నాగచైతన్య వెరీ డౌన్ టు ఎర్త్ వుండే మనిషి. యాక్టింగ్‌లో చాలా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా నన్ను, అనుని కన్విన్స్ చేసే సీన్ వుంది అక్కడ చాలా ఈజ్‌తో మెచ్చూర్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.. వెరి గుడ్ ఆర్టిస్ట్.
డైరక్టర్ మారుతి వర్కింగ్ స్టైల్ ఎలా వుంది.. సీనియర్‌గా ఎమైనా టీజ్ చేశారా..?
టీజ్ చేయటమా అంత టైమ్ ఇవ్వరు ఈ డైరక్టర్.. బాబోయ్ స్పీడ్‌గా వర్క్ చేస్తారు. మిషన్ లా … జస్ట్ రెడి అయ్యి కూర్చుందామనుకునే సరికి రెడి రెడి అని కాల్ చేస్తారు. ఒక రోజు వర్షం పడుతుంది కదా వదిలేస్తాడేమో అనుకున్నా.. ఆ గ్యాప్‌లో కూడా తీసేశారు.. వెరి గుడ్ ఫ్యూచర్ వుంది. వెరి గుడ్ ప్లానింగ్.. నా కెరీర్లో ఇంత ఫాస్ట్‌గా షూటింగ్ చేసి ఇంత ఫాస్ట్‌గా ఇచ్చిన చిత్రం శైలజారెడ్డి మాత్రమే.
మీరు సీరియస్ పాత్ర ఎలా చేస్తారో అంతే ఈజీగా కామెడి కూడా చేస్తారు.. ఎలా అంత ఈజీగా వస్తుంది మీకు..?
అలా ఏమి కాదు ఆర్టిస్ట్ అంటే అన్ని చేయ్యాలి.. కొ-ఆర్టిస్ట్ పెర్ఫెక్ట్గా వుంటే కామెడి చాలా బాగా వస్తుంది అది కూడా స్పాంటెనియస్గా వస్తుంది.. నేను కామెడి బాగా చేసింది పంచతంత్రం చిత్రం ఈ శైలజారెడ్డి అల్లుడులో నా చుట్టూ కామెడి జరుగుతుంది. హిలెరియస్గా వుంటుంది కాని నేను సీరియస్‌గా వుండాలి.. ఇది నాకు ఢిఫకల్ట్గా అనిపించింది.
సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి గురించి చెప్పండి..?
మీరు సినిమాలో చూశారు అందరూ చాలా అందంగా వున్నారు.. కాని మారుతి వర్క్ స్పీడ్‌కి ఆయన పరిగెత్తి పరిగెత్తి షూట్ చేసేవాడు పాపం.. గ్రేట్ పీపుల్‌తో వర్క్ చేశాను అనే ఫీలింగ్ వుంది నాకు.
మీరు భాహుబలి చిత్రం తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇలా అత్తగా కనిపించారు.. మరి ఇలాంటి రోల్స్ వస్తే చేస్తారా..?
నేను చేసిన వెరైటి రోల్స్ మాత్రమే నన్ను ఆర్టిస్ట్‌గా నిలబెట్టాయి.. సో ఇలాంటి వైరైటి రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను.
ఈ సినిమా నిర్మాతల గురించి చెప్పండి..?
చాలా ఫ్యాషనేట్ ప్రోడ్యూసర్స్ అలాగే దర్శకుడ్ని నమ్మి నటీనటుల్ని నమ్మి ఇలాంటి చిత్రాలు చేసే నిర్మాతలు చాలా అరుదుగా వుంటారు. వారికి నా తరుపున కంగ్రాట్స్..
చివరిగా మీరు ఈ చిత్రం గురించి..?
చాలా మంచి చిత్రం.. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరూ ఆదరిస్తున్నారు. ఇలాగే శైలజారెడ్డి అల్లుడ్ని మరింత ఆదరించాలని కోరుకుంటున్నాను.