చైతన్యకు సమంత పెళ్లి రోజు గిఫ్ట్‌..?

357
Samantha
- Advertisement -

టాలీవుడ్‌లో నాగ చైతన్య, సమంతలు రీల్ లైఫ్‌ నుండి రియల్ లైఫ్‌ జంటగా మారి సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగుతున్నారు. అయితే వచ్చే నెలలో చైతూ – సమంతల మొదటి పెళ్లి రోజు రాబోతుంది. వీరి పెళ్లి అయ్యి సంవత్సరం పూర్తి కాబోతున్న సందర్బంగా అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

Samantha

తాజాగా సమంత నటించిన ‘యూటర్న్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత మీడియాతో మాట్లాడుతూ.. తన మొదటి పెళ్లి రోజుపై స్పందించింది. మొదటి పెళ్లి రోజుకు చైతుకు మీరు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు అంటూ విలేకరి ప్రశ్నించగా ఆమె సమాధానంగా.. వచ్చే నెల 6వ తేదీన నేను చైతూతో కలిసి ఒక కొత్త సినిమాలో నటిస్తున్నాము.. ఆ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మా పెళ్లి రోజున నేను చైతూకు ఇచ్చే గిఫ్ట్ అదే అంటూ తెలిపారు. పెళ్లి అయిన తర్వాత వీరిద్దరు కలిసి నటించబోతున్న మొదటి సినిమా అదే కావడం విశేషం.

ఇక ఈ చిత్రానికి దర్శకుడిగా శివ నిర్వాన వ్యవహరిస్తున్నాడు. కోన వెంకట్ ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, నాగచైతన్యలు భార్య – భర్తలుగా కనిపించబోతున్నారు. అంటూ సమాచారం అందుతుంది. భార్య భర్తల మద్య ఉండే సీన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటాయని సమాచారం అందుతుంది. పెళ్లి తర్వాత నాగచైతన్య – సమంత కలిసి నటించబోతున్న సినిమా అవ్వడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -