రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని…కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని స్పష్టం చేశారు కేటీఆర్. బుధవారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తిర విషయాలను వెల్లడించారు. హరీష్,తన మధ్య విభేదాలు లేవని ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా ఇద్దరం నవ్వుకుంటామన్నారు. ప్రతిరోజు హరీష్,తాను మాట్లాడుకుంటామన్నారు.
ఎన్నికల్లో కేసీఆరే మా నినాదమని…ఎన్నికలకు కర్త,కర్మ,క్రియ ఆయనే అని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని…ప్రజలకు టీఆర్‌ఎస్‌పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. మా కష్టం 20 శాతం అయితే కేసీఆర్ కష్టం 80 శాతమని చెప్పారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గతంలో తీవ్రమైన విద్యుత్ సమస్యలుండేవి…కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడే వారని..ఇందిరాపార్క్ వద్ద పారిశ్రామిక వేత్తలు ధర్నా చేసే పరిస్ధితి ఉండేదని కాదని ఇప్పుడు తెలంగాణ 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రమని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు
బేషుగ్గా ఉన్నాయని… హైదరాబాద్‌లో దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రోడ్లకు సంబంధించి కొంత సమస్య ఉందని త్వరలో దానిని పరిష్కరిస్తామన్నారు.
ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా పేరు తెచ్చుకున్నామని …కేవలం ప్రభుత్వపరంగా సంబంధం కాదు… ఉద్యమ కాలం నుంచి వారితో కలిసి పనిచేశామన్నారు. ఉద్యోగులపై పూర్తి నమ్మకం ఉందని… వారి ఆకాంక్షలు కేసీఆర్‌కు తెలుసని వాటిని తప్పక పరిష్కరిస్తారన్నారు.