కొన్ని కొన్ని సార్లు ఫామ్ లో ఉన్న యువ తారలు. అనుకోకుండానో ,లేదా సరదా అన్న మాటలో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిపోతాయి. ఉదాహరణకి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్న “చెప్పను బ్రదర్” అన్న ఒకే ఒక్క మాట ఆయన్ని ఎన్ని విమర్శలకు గురిచేసిందో వేరే చెప్పనక్కర్లేదు. ఆయన అన్న ఆ మాట వెనుక అర్ధం వేరే ఉన్నా ఆయన అనింది మా దేవుణ్ణి అని పవన్ అభిమానులంతా అల్లు అర్జున్ కు వ్యతిరేకమైపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విమర్శల వలలో చిక్కుకోవడానికి యువ సెలెబ్రిటీ నాగ శౌర్య సిద్ధంగా ఉన్నాడనిపిస్తుంది.
ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న నర్తనశాల సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన శౌర్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుతూ. “ఈ కాలం లో ఎవరూ స్టార్ లు లేరండి. ఎవరికీ ఫాన్స్ లేరు. ప్రేక్షకులు కేవలం ఇష్టపడతారంతే, ఈ కాలం లో ఎవరూ పూజలు చేయట్లేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్, ఎన్.టి.ఆర్ , రామ్ చరణ్.. అక్కడితో ఆగిపోయింది. ఒకప్పుడు హీరోలను చూడటానికి బస్సులు కట్టుకుని మరీ ఫిలిం నగర్ వరకు వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ అభిమాన హీరో ప్రమోషన్ అని, ఈవెంట్స్ అని పదే పదే కనిపిస్తుంటే ఇంకా వాళ్ళని దేవుళ్ళలా ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని కేవలం ఇష్టపడతారంతే తప్ప.ఎవరినీ దేవుళ్ళలా ఫీల్ అవ్వరు. ఇక్కడ ఎవరూ స్టార్లు లేరు.”అని అందరినీ అవాక్కయ్యేలా చేసాడు నాగ శౌర్య.
శౌర్య చెప్పిన మాటల్లో ఓ లాజిక్ ఉన్నా స్టార్ హీరోల అభిమానులు దీన్ని ఏ విధంగా అర్ధం చేసుకుంటారన్నదే ఇక్కడ చర్చనీయాంశమైన విషయం. దీనిపై సోషల్ మీడియా లో ఎన్ని విమర్శనాస్త్రాలు వస్తాయో వేచి చూడాలి.