యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. వరుస హిట్లతో జోరుమీదున్న ఎన్టీఆర్..ఈచిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్…ఇద్దరూ మొదటిసారి కలిసి ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఈమూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డె, ఈషా రెబ్బలు హీరోయిన్లుగా నటిస్తుస్తున్నారు.
ఇక ఈమూవీలో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నాగబాబు ఏ పాత్రలో నటించనున్నాడని గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తుంది. ఎన్టీఆర్ కు తండ్రిగా నాగబాబు నటిస్తున్నాడని సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా..తాజాగా నాగబాబు పాత్రపై మరో వార్త వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం నాగబాబు ఈచిత్రంలో గ్రామ సర్పంచ్ గా కనిపిస్తాడట..రాయలసీమలో ఓ గ్రామానికి ఆయన పెద్ద మనిషి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.
ఎన్టీఆర్, నాగబాబు కు సంబంధించిన ఎమోషనల్ స్టీల్స్ కూడా ఇటివలే విడులయిన విషయం తెలిసిందే. అరవింద సమేతలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో..సినిమాపై భారీ ఆశలు ఉన్నాయి. దసరా పండగ సందర్భంగా మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. జగపతిబాబు, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పలువురు నటీనటులు కీలకపాత్రలో నటిస్తున్నారు.