గత కొంతకాలంగా తమిళ చిత్ర పరిశ్రమపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకనిర్మాత వారాహిపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ మీడియా కార్యక్రమంలో తనను వ్యభిచారి అంటూ పేర్కొన్నాడని, ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, తనతో అసభ్యంగా మాట్లాడుతున్నాడని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడికి రాకముందు నడిగర్ సంఘం పెద్దలు విశాల్, నాజర్, కార్తి ఫిర్యాదు చేయాలని వెళితే వాళ్లు పట్టించుకోలేదని శ్రీరెడ్డి తెలిపింది.
వారాహిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. చిత్ర పరిశ్రమలో సినిమా అవకాశాలు పేరిట చాలా మంది అమ్మాయిలను వేధిస్తున్నారని పోలీసులకు తెలిపింది. కొంతకాలంగా సైలెంట్ ఉన్న శ్రీరెడ్డి.. ఈ మధ్యకాలంలో తమిళ సినీ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. దర్శకుడు మురుగుదాస్, నటుడు లారెన్స్ , నటుడు సుందర్ తదితరులపై ఆరోపణలు చేసింది.
శ్రీరెడ్డి ఆరోపణలలో నిజం ఉంటే సాక్ష్యాలు చూపించాలని హీరో విశాల్ స్పష్టం చేశాడు. ఇటీవలె కార్తి కూడా శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించాడు. సాక్ష్యాలు ఉంటే పోలీసులను కలవాలి కానీ ఇలా సోషల్ మీడియా ద్వారా అసభ్యంగా పోస్టులు చేయడం పద్దతి కాదని చెప్పారు. చూడాలి ఇక శ్రీరెడ్డి తమిళ పోరాటం ఎంతవరకు వస్తుందో.