హోటల్ లో సర్వర్ గా పనిచేశాః పూరీ జగన్నాథ్..

252
puri jagannath emayaperemito
- Advertisement -

టాలీవుడ్ టాప్ దర్శకులలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. స్టార్ హీరోలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను కొట్టిన పూరీ ప్రస్తుతం ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఈ మాయ పేరేమిటో. ఈమూవీకి కొప్పుల రాము దర్శకత్వం వహించాడు. రాహుల్ సరసన హీరోయిన్ గా కావ్య తాపర్ నటించారు. ఈచిత్రం ఆడియో లాంచ్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆ ఆడియోకు ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు దర్శకుడు పూరీ జగన్నాధ్ కూడా హాజరయ్యాడు.

puri, vijay master

ఈఆడియో ఫంక్షన్ లో పూరీ స్టంట్ మాస్టర్ విజయ్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. విజయ్ మాస్టర్ ను చూస్తుంటే నాకు ఫ్లాష్ బ్లాక్ గుర్తొస్తుందన్నారు. కృష్ణ నగర్ హోటల్ తాను పనిచేసేవాన్ని అని అప్పట్లో కొంత మంది హోటల్ కు వచ్చిన వ్యక్తులు నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించే వాళ్లన్నారు. అదే హోటల్ కు స్టంట్ మాస్టర్ విజయ్ కూడా వచ్చే వారని..కానీ ఆయన నాతో చాలా బాగా మాట్లాడేవారన్నారు. చిరునవ్వుతో ఎంతో బాగా నన్ను పలకరించేవాళ్లన్నారు. అలాగే నా మొదటి చిత్రం బద్రిలో విజయ్ మాస్టర్ తో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసినిమాకు విజయ్ మాస్టర్ కూతురు దివ్యా విజయ్ ప్రోడ్యూసర్ గా వ్యవహరించారు.

- Advertisement -