ఇంక్రెడిబుల్ లీడర్.. కేటీఆర్

280
ktr mahesh
- Advertisement -

ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నేతలు, ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ నేతలు మొదలుకొని ఆయన అభిమానులు మొక్కలు నాటారు. కేక్స్ కట్ చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్ చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆయనకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మంచి మిత్రుడు, ఇంక్రెడిబుల్ లీడర్, మానవతావాది కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. మహేష్ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పారు

మహేష్‌తో పాటు రాంచరణ్,మంచు లక్ష్మీ,మంచు విష్ణు,దర్శకుడు శంకర్,యాంకర్ మాచరాజు ప్రదీప్,అనసూయ,మధుర శ్రీధర్ రెడ్డి,దేవి ప్రసాద్,శోభు యార్లగడ్డ,గోపిచంద్ మలినేని,బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌డే విషెష్ చెప్పిన ప్రతి ఒక్కరికీ.. కేటీఆర్ థ్యాంక్స్ చెప్తూ రీట్వీట్ చేస్తు శుభాకాంక్షలు చెప్పారు.

- Advertisement -