మీ అభిమానానికి కృతజ్ఞతలు:కేటీఆర్

1556
ktr birthday
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా యూత్ ఐకాన్,మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సినీ,రాజకీయ రంగ ప్రముఖులు రామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రక్త దానాలు,మొక్కలు నాటడం,రోగుల పండ్లు పంపిణీ వంటి సేవాకార్యక్రమాలను నిర్వహించారు టీఆర్ఎస్ కార్యకర్తలు.

తనకు పుట్టినరోజు తెలిపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతు ట్వీట్ చేశారు కేటీఆర్. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు…మీ అందరినీ కలవాలని ఉంది కానీ ఆదివారం సాయంత్రం నుంచి జ్వరంతో బాధపడుతున్నా అంటూ ట్వీట్ చేశారు. ప్చ్‌ వయసు పైబడుతోంది అంటూ లైటర్‌ వెయిన్‌లో పంచ్‌ పేల్చారు.

పలువురు నెటిజన్లు రామన్నపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. బంగారు తెలంగాణ సాధనలో తండ్రిబాటలో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారని ట్వీట్ చేశారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ, ఐటీరంగం అబివృద్ధితో పాటు, పెనుమార్పులను తీసుకొచ్చారని కొనియాడుతున్నారు. చేనేతకు అండగా, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు నెటిజన్లు.

- Advertisement -