ఆగస్టు 15 నుంచి మెట్రో సెకండ్ ఫేజ్…!

234
kcr metro
- Advertisement -

పంద్రాగస్టు నుంచి మెట్రో సెకండ్ ఫేజ్ అందుబాటులోకి రానుంది. ఆగస్టు 15న సీఎం కేసీఆర్ ఎల్బీనగర్-అమీర్ పేట(17 కి.మీ) మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ రూట్‌లో ట్రయల్ రన్‌ నిర్వహించారు అధికారులు. మంత్రి కేటీఆర్‌ సైతం ఎల్బీనగర్‌ నుండి అమీర్‌ పేట మార్గంలో మెట్రలో ప్రయాణించారు.

మెట్రో స్టేషన్ల పరిధిలో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. దీనికి తోడు గ్రేటర్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నారు. మియాపూర్‌ స్టేషన్‌లో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నాంపల్లి రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్‌ను మెట్రోతో అనుసంధానం చేశారు. సెకండ్ ఫేజ్‌లో అత్యంత కీలకమైన బోయిగూడా ఆర్‌వోబీ నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. దీంతో జేబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో పనులకు మార్గం సుగమమైంది.

ప్రస్తుతం నాగోల్-అమీర్ పేట మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ప్రతీ రోజు 80 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ రూట్లో అక్టోబర్‌లో, ఎంజీబీఎస్‌–జేబీఎస్‌ రూట్లో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో అందుబాటులోకి రానుంది.

- Advertisement -