టీం ఇండియా ప్లేయర్లు ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈసందర్భంగా ఇంగ్లాండ్ తో మొన్న జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించారు. నిన్న జరిగిన రెండవ మ్యాచ్ లో ఇండియాపై ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేపు జరిగే మూడవ వన్డేలో గెలిచి ఎలాగైనా సిరీస్ సాధిస్తామనే నమ్మకంతో ఉంది కోహ్లి సేన.
1-1 తో ఇద్దరు సమానంగా ఉన్నారు. ఇక మూడవ మ్యాచ్ పై రెండు దేశాల ప్లేయర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20ఓవర్లలో 148పరుగులు చేసి 8 వికెట్లు కోల్పొయింది. మొదటి మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్ బ్యాట్స్ మెన్ కెఎల్. రాహుల్ రెండవ మ్యాచ్ లో 6పరుగులకే పరిమితమయ్యాడు. ఇక కోహ్లి 47పరుగుల వద్ద అవుట్ కాగా, సురేశ్ రైనా 27, దోని 32పరుగులు చేశారు.
సెకండ్స్ ఇన్సింగ్ లో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ప్లేయర్లు ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించారు. అలెక్స్ హెల్స్ తన బ్యాటింగ్ తో జట్టులో కీలకపాత్ర పోషించాడు. మొత్తం మూడు మ్యాచ్ లలో ఇద్దరు ఒక మ్యాచ్ గెలవడంతో సిరీస్ పై ఇరువురి జట్లు కన్నేశారు. ఆదివారం జరుగనున్న మూడవ ట్వీ20లో సిరీస్ ఎవరు కైవసం చేసుకుంటారో వేచి చూడాలి.