జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లో బజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు లేకుండా పోటిచేయనున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ఆయన పోరాట యాత్రలతో ఏపీలో ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అపట్లో తనకు చాలా ఆవేశం ఉండేదని…కోపం వస్తే ఏం చేస్తానో తనకు కూడా అర్ధం కాకపోయేదన్నారు. అందుకోసం తన ఆవేశాన్ని గుర్తించిన అన్నయ్య చిరంజీవి..నేను ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లకి వెళ్లిపోతానన్న ఆందోళనతో నాకు తుపాకి కొనిచ్చారన్నారు. తుపాకి కొనిస్తే నన్ను ఇంట్లోనే ఉండవచ్చని ఆలోచించి తనకు తుపాకిని కొనిచ్చారని విశాఖపట్నంలోని సభలో చెప్పారు. తన ఆవేశం, కోపం, బాధ అన్ని అన్యాయంపైనే కానీ తుపాకి పైన కాదన్నారు.
తుపాకిని ఎలా వాడలో కూడా నాకు తెలియదన్నారు. నేను ఎక్కడ ఉద్యమాల్లోకి వెళతానని మా అన్నయ్య భయపడి నాకు తుపాకి కొనిచ్చారన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఎలా ఉరుకోవాలన్నారు. పాలకులను ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టానన్నారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ తాను పోరాటం చేస్తానని చెప్పారు.