క్యాస్టింగ్ కౌచ్ పై మల్లికా హాట్ కామెంట్స్…

252
mallika-sherawat
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్  హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మల్లికా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. తనను కొంద మంది గెస్ట్ హౌజ్ కి రావాలని అర్ధ రాత్రి ఫోన్ చేసి వేధించేవారని, మరికొందరైతే నీచంగా మాట్లాడే వారని చెప్పింది. కొంత మంది హీరోలతో నేను చనువుగా నటించడం లేదని, కొన్ని సినిమాల నుంచి తనను తప్పించారని చెప్పారు. తెరపై బాగానే నటిస్తావు కానీ.. బయట చనువుగా ఉండడానికి ఇబ్బంది ఏంటీ..? అని అడిగేవారని చెప్పుకొచ్చింది.

Mallika-Sherawat

మొదటి సినిమాలో హాట్ గా కనిపించడంతో.. తర్వాత కూడా తనకు అలాంటి పాత్రలే ఇచ్చేవారని చెప్పారు. తనకు బోల్డ్ నటిగా, హాట్ నటిగా పేరు రావడానికి దర్శకులు, తన తోటి నటులే కారణం అని పేర్కొన్నారు. ఏ పాత్రలోనైనా నటిస్తుందనే అపనిందలు వేశారని, చిన్న దుస్తులు వేస్తుందని, రొమాన్స్ సీన్స్ లలో నటిస్తుందని, సిగ్గు వదిలిన నటి అంటూ చాలా మంది నిందలు వేశారని చెప్పారు. ఈ మాటలు తనను ఎంతో బాధించాయని, కొన్ని సందర్భాలలో తనలో తానే కుమిలిపోయానని తనలోని బాధను వ్యక్తపరిచింది.

- Advertisement -