మంత్రులను పరుగులు పెట్టించిన స్పీకర్

189
karnatakaspeaker (1)
- Advertisement -

కర్నాటన అసెంబ్లీ స్పీకర్‌  రమేష్‌ కుమార్‌కు కోపం వచ్చింది. సాక్ష్యాత్తు మంత్రులే అసెంబ్లీ రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మంత్రులు 15 నిమిషాల్లోనే అసెంబ్లీకి రావాలంటూ హుకుం జారీ చేశారు. ఇంతకు ఆ స్పీకర్‌కు అంతలా ఎందుకు కోపం వచ్చిందంటే ఆ రాష్ట్ర మంత్రులు అసెంబ్లీ సమావేశాలను తేలికగా తీసుకోవడమేనటా.

కర్నాటక అసెంబ్లీలో గవర్నర్‌కు ప్రసంగానికి ధన్యవాద తీర్మాణం సమయంలో అసెంబ్లీలో మొత్తం 13 మంత్రులు అసెంబ్లీకి హాజరు కావాల్సి ఉండగా కేవలం 6గురు మంత్రులు మాత్రమే సభకు వచ్చారు. దీంతో స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌరవ ప్రదమైన పదవుల్లో ఉంటూ అసెంబ్లీ సమావేశాలన ఎలా తేలికగా తీసుకుంటారంటూ ఆయన మంత్రులను ప్రశ్నించారు. స్వీకర్ ను, సభాధ్యక్ష స్థానాన్ని తేలికగా తీసుకుంటే బాగుండదని ఆయన  మంత్రులకు హెచ్చరించారు. సాక్ష్యాత్తు స్పీకరే మందలించడంతో తర్వాత మంత్రులందరూ అసెంబ్లీకి హాజరయ్యారు.

- Advertisement -