బీజేపీలోకి ప్రభాస్ …కృష్ణంరాజు క్లారిటీ..!

268
Prabhas
- Advertisement -

ముందస్తు ఎన్నికల వస్తాయన్న ఉహాగానాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం హిటెక్కింది. ఇక ముఖ్యంగా ఏపీలో టీడీపీ,వైసీపీ,జనసేన మాటల తూటాలతో ముందస్తు హిట్‌ను మరింతగా పెంచేశాయి. ఓ వైపు జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తు ముందుకెళుతుండగా జనసేనాని పవన్ సైతం తనదైన శైలీలో ముందుకుసాగుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిపై కన్నేసిన కమలనాథులు ముఖ్యంగా ఏపీలో గణనీయంగా పుంజుకునేందుకు పావులు కదుపుతున్నారు.

బీజేపీకి మరింత సినీ గ్లామర్ తెచ్చేందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను కృష్ణంరాజు రంగంలోకి దించుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పుకార్లపై స్పందించారు కృష్ణంరాజు.బీజేపీకి ప్రభాస్‌కు ఎలాంటి సంబంధం లేదని వచ్చే ఎన్నికల్లో ప్రభాస్‌ ఏ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడని తేల్చిచెప్పేశారు కృష్ణంరాజు.

తాను ఎంపీగా బరిలోకి దిగినా ప్రభాస్ ప్రచారం చేయడని తెలిపారు. ప్రభాస్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందన్నారు. టీడీపీ అవినీతిలో కురుకుపోయిందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన స్ధానాలు దక్కించుకుంటుందని తెలిపారు.

- Advertisement -