ఇంగ్లాండ్‌పై పంజా విసిరిన రాహుల్..

242
lokesh rahul
- Advertisement -

ఐర్లాండ్ పర్యటనను విజయవంతంగా ముగించిన భారత్…ఇంగ్లాండ్ పర్యటనను సైతం గెలుపుతో ఆరంభించింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ విరవిహారం ముందు ఇంగ్లీష్ బౌలర్లు తేలిపోయారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రాహుల్‌…గ్రౌండ్ నలువైపులా బంతిని పరుగులు పెట్టించాడు.ఇంగ్లాండ్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే చేధించింది కోహ్లీ సేన.

లక్ష్యఛేదనలో ఆదిలోనే భారత్‌కు ధావన్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే ధావన్(4) పరుగులకే వెనుదిరిగాడు. అయితే తర్వాత మరో వికెట్ పడకుండా రోహిత్,రాహుల్ జాగ్రత్తగా ఆడారు. ముఖ్యంగా రాహుల్‌ తన బ్యాట్‌క పనిచెప్పి జట్టులో తన అవసరాన్ని చాటాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు,5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20 కెరీర్లో రెండోసెంచరీని నమోదుచేశాడు. రాహుల్‌కు తోడుగా రోహిత్(30),కోహ్లీ(20) రాణించడంతో భారత్ గెలుపు నల్లేరుపై నడకే అయింది.

అంతకముందు టాస్‌ గెలిచిన కోహ్లీ…ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ 5 ఓవర్లు ముగిసేసరికి 50 పరుగులు చేసింది. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన కుల్దీప్ యాదవ్‌ మ్యాచ్‌ గమనాన్నే మార్చేశాడు. తన మణికట్ఉ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. కల్దీప్ దెబ్బకు అలెక్స్ హేల్స్(8),మోర్గాన్(7),బారిస్టో(0),జోరూట్‌(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలివగా.. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం జరగనుంది.

- Advertisement -