జగిత్యాల అసెంబ్లీ బరిలో కవిత..!

236
mp kavitha
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత,జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ కవిత టార్గెట్ చేసిందా..? ఏడుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవన్ రెడ్డి నియోజకవర్గంలో పాగా వేసేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందా…?అంటే తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే అవుననే అనిపిస్తోంది.

కొన్నిరోజులుగా జగిత్యాల నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి సారించిన కవిత విస్త్రృతంగా పర్యటిస్తున్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు,హైదరాబాద్ తర్వాత జగిత్యాల మున్సిపాలిటీకి 4160 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయడం ఆ ఉహాగానాలకు బలం చేకూరుస్తోంది. అంతేగాదు ఇప్పటివరకు కవిత ఏ నియోజకవర్గంలో పర్యటించని విధంగా జగిత్యాలలో 30 సార్లు పర్యటించింది.

ఇప్పటివరకు జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న జీవన్‌ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చేవిధంగా ఎంపీ కవిత వ్యూహాలు రచిస్తోందని సమాచారం. జీవన్‌రెడ్డిని నిజామాబాద్ ఎంపీగా బరిలోకి దింపడం ద్వారా ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన సీనియర్ నేత డీఎస్‌ కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటం,ఆయన కుమారుడి కోసం ఇతరపార్టీలో టచ్‌లో ఉన్నాడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జీవన్‌రెడ్డి టీఆర్ఎస్‌లోకి వస్తే పొలిటికల్ సీన్‌ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా జగిత్యాల రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

- Advertisement -