బాలీవుడ్ లో ‘సంజు’ కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో.. మూడు రోజులలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. కేవలం మూడు రోజులలో రూ.120.6 కోట్ల కలెక్షన్స్ రాబట్టి, ఈ ఏడాదిలో మొదటివారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. సంజయ్ దత్ పాత్రలో రణ్ బీర్ కపూర్ నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.34.75 కోట్లు రాబట్టి, ఈ ఏడాదిలో విడుదలైన సినిమాలలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
రెండవ రోజు రూ. 38.60 కోట్లు, మూడవ రోజు రూ. 46.71 కోట్లు కలెక్షన్స్ రాబట్టి మూడు రోజుల్లో మొత్తం 120.06 కోట్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. మొదటి వారంలో అత్యధిక వసూళ్లూ రాబట్టిన సినిమాలలో సంజు రూ.120.6 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా..పద్మావత్ రూ.114 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇక సల్మాన్ రేస్3 రూ. 106.47 కోట్లతో మూడవ స్థానంలో ఉంది. ఇక సంజు పాత్రలో రణ్ బీర్ కపూర్ ఒదిగిపోయారని, రాజ్ కుమార్ హీరాణీ దర్శకత్వంలో మరో అద్భుతమైన సినిమా ఇది అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.