ఆమెతో మ‌రోసారి న‌టించాల‌నుందిః రామ్ చ‌ర‌ణ్

212
Ram-Charan
- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టింస్తుంది. ద‌స‌రాకు ఈమూవీని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈసంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ ఓ ఇంట‌ర్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా అంటే త‌న‌కు చాలా ఇష్టం అని చెప్పారు. అవ‌కాశం వ‌స్తే ప్రియాంక చోప్రాతో మ‌రోసారి క‌లిసి న‌టించాల‌ని ఉంద‌న్నారు.

zanjeer

ఐదేళ్ల క్రితం వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన జంజీర్ చిత్రం తెలుగులో తుఫాన్ గా విడుద‌ల‌య్యి బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తా ప‌డిన విష‌యం తెలిసిందే. కెరీర్ మొద‌ట్లోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి జంజీర్ సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాన‌ని తెలిపాడు. కానీ ఆసినిమా ఇచ్చిన ఫ‌లితంతో మ‌ళ్లి బాలీవుడ్ న‌టించ‌లేద‌న్నారు. ఆసినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని కానీ చివ‌ర‌కు ఫ‌లితం మాత్రం నిరాశ‌ప‌రిచింద‌న్నారు. మంచి క‌థ దొరికితే బాలీవుడ్ లో మ‌రో సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్నాన‌ని తెలిపాడు. ప్రియాంక చోప్రాతో మ‌రోసారి సినిమా చేస్తాన‌ని చెప్పారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.

- Advertisement -