ప్రిన్స్ మహేష్ బాబు భరత్ అను నేను మూవీతో ఘన విజయాన్ని అందుకున్నాడు. భరత్ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ డెహ్రాడూన్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం డెహ్రాడూన్లో 2 నెలల వరకు షూటింగ్ జరుపాలని ముందుగానే అనుకున్నారు. కాని మన ప్రధాని మోదీ కారణంగా షూటింగ్ ఆపేశారట.
ఇక అసలు విషయం ఏంటంటే.. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేశారు మోదీ. ప్రధాని వస్తున్న కారణంగా నెల రోజుల ముందుగానే ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. అయితే ఆ ఇనిస్టిట్యూట్లోనే మహేష్ మూవీ చిత్రికరించాలని ప్లాన్ చేసుకుంది చిత్ర బృందం. ఇకడే రెండు నెలల పాటు షూటింగ్ జరపాలనుకున్న టీంకి నిరాశ ఎదురైంది.
ఇక ఈ మూవీ చిత్రీకరణకు దాదాపు నెలల బ్రేక్ పడడంతో సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న ఈ మూవీ కొంత ఆలస్యంగా రిలీజ్ అవుతుందని సిని వర్గాల సమాచారం. మరి ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా,హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతున్నారు.