హ్యాపీ వెడ్డింగ్…ఏంచేసినా రొమాంటికే..!

313
happy-wedding
- Advertisement -

నాగ్ అశ్విన్-మెగా డాటర్ నిహారిక కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం హ్యాపీ వెడ్డింగ్. పల్లెటూరు వాతావరణంలో పెళ్లి ప్రధానాంశంగా ప్రేక్షకుల ముందుకురానుంది. యువీ క్రియేషన్స్-పాకెట్ సినిమా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. శక్తికాంత్ సంగీతం అందించగా తమన్ బ్రాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలె ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది.

మాకు బంధువులు ఎక్కువే కానీ పనులకు ఎవరు రారు అంటూ మొదలయ్యే టీజర్‌ ఆసక్తిగా తీర్చిదిద్దారు. మా మనవడికి పెళ్లి కుదిరిపోయింది అబ్బాయి..పిల్ల సూపర్‌ ..యాడ బట్టినవే పొరగాన్ని మస్తుగుండూ అంటూ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన పాల లాంటిది మా హ‌ర్ష‌.. కాఫీ చేసుకోవ‌చ్చు, కాంప్లైన్ చేసుకోవ‌చ్చు.. మ‌రి మా మ‌న‌వ‌డితో కాపురం చేసుకోవ‌చ్చా అండి అన్నపూర్ణమ్మ మాటలు అదిరిపోయాయి. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

- Advertisement -