ఆకట్టుకుంటున్న ‘విశ్వరూపం2’ సాంగ్..

242
Kamal Hasan
- Advertisement -

విలక్షణ నటుడు కమల్ హాసన్ స్వీయదర్శకత్వంలో విశ్వరూపం2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. క‌మ‌ల్ హాస‌న్‌, కౌశికి చ‌క్ర‌వ‌ర్తి, మాస్ట‌ర్ కార్తీక్‌, సుర‌ష్ అయ్య‌ర్‌లు పాడిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ చిత్రానికి గిబ్రాన్ స్వరాలు అందించారు. విశ్వరూపం స్వీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు పలు భాషలలో ఏకకాలంలో విడుదలకానుంది.

Kamal Hasan

కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆగిపోగా, అన్ని అడ్డంకులను తొలగించుకుని తాజాగా పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుని రిలీజ్ కి సిద్దమవుతోంది. త్వరలో ఆడియో వేడుకను జరుపుకోనుంది. ఇక ట్రైలర్ లో కమల్ హాసన్ విశ్వరూపం  చూపించారు.

ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక విశ్వరూపం ఎన్నో రాజకీయ అడ్డంకుల నడుమ విడుదలై,  ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఆయన రాజకీయనాయకుడిగా… పార్టీ అధ్యక్షుడిగా మారిన తర్వాత విడుదల అవుతున్న సినిమా కావడంతో  ప్రేక్షకులలో, రాజకీయనాయకులలో ఆసక్తి నెలకొంది. మరి విశ్వరూపం2 ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

విశ్వరూపం2 ట్రైలర్..

- Advertisement -