వైఎస్ఆర్ యాత్రలో.. రంగమ్మత్త..

234
Anasuya-yatra

బులితెర యాంకర్ గా అలరిస్తూనే.. వెండితెరపై మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో అమ్మడుకి వరుస సినిమా అవకాశాలు తలుపు తడుతున్నాయి.

Anasuyaతాజాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లోనూ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళా నేత పాత్రలో అనసూయ కనిపించనున్నారని సమాచారం. ఇందుకు అనుసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పాత్ర చిన్నదే అయినా..  ప్రాధాన్యమైన పాత్ర కావడంతో ఒప్పేసుకుందట.

 వైఎస్ఆర్ బయోపిక్ కి యాత్ర అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందులో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఆనందో బ్రహ్మ సినిమా దర్శకుడు మహి వి.రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో సినిమా చిత్రకరణ పూర్తి అయ్యేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక జగన్ పాత్రలో తమిళ్ స్టార్ సూర్య నటించనున్నట్లు టాక్. ఎవరు ఏ పాత్రలలో నటించనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

అమెరికా సెక్స్ రాకెట్‌పై అనసూయ స్పందన..

వైయ‌స్ఆర్ బ‌యోపిక్ ప్ర‌చారంలో ప్ర‌భాస్