దీపికా..బ్రూస్‌ లీ కలయికతో ఆర్‌సీకేగా వర్మ… కేసీఆర్

221
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెన్సేషనల్ సినిమాను అనౌన్స్ చేశాడు.విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆర్ సీకే పేరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఇప్పటివరకు ఎవరికీ తెలియని కేసీఆర్ ను ఇందులో చూస్తారని ట్వీట్ చేశాడు. యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించటంలో స్పెషలిస్ట్గా పేరున్న వర్మ…కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమా పేరు ఆర్ సీకే అని ప్రకటించారు.

online news portal

కేసీఆర్‌ను దీపిక పదుకునె అంత అందం కలగలిసిన తెలంగాణ బ్రూస్‌లీగా, మరే ఇతర రాజకీయ నాయకుడికి లేని లక్షణాలు ఉన్న వారిగా తన ఆర్‌సీకేలో చూపించనున్నట్లు వెల్లడించాడు. ఇంతవరకూ అందరికీ తెలిసిన కేసీఆర్, బయటకి కనిపించే కేసీఆర్ కాకుండా కేసీఆర్ ఆలోచనలు, కేసీఆర్ లోపలి నుంచి ఎలాంటి వారు అనేది తన సినిమాలో హైలైట్ అవుతాయని వర్మ ట్వీట్ చేశారు.

bruce lee

ఇటీవల కాలంలో వరుసగా తెలుగు సినిమాలు చేసి విసుగు తెప్పించిన వర్మ.. వంగవీటి సినిమా ఎనౌన్స్మెంట్ సమయంలో ఇది నా చివరి తెలుగు సినిమా అంటూ ప్రకటించాడు. తర్వాత గ్యాంగ్ స్టర్ నయీం జీవిత చరిత్రను మూడు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి జీవితంపై మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మధుర శ్రీధర్ దర్శకత్వంలో నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమా నిర్మించనున్నాడు.

online news portal

గతంలో కూడా వర్మ కేసీఆర్‌ పై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ అని పలికేటప్పుడు వచ్చే సౌండింగ్ ఎన్టీఆర్, వైఎస్సార్ అనే పేర్లలో లేదు. అధికారం, అయన వ్యక్తిత్వం కేసీఆర్ ను అందగాడిని చేశాయని వర్మ ట్వీట్ చేశారు. అంతటితో ఆగలేదు, హీరోయిన్లతో తెలంగాణ సిఎంను పోల్చారు. సమంత, తమన్నా, ఇలియానా లను కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో ఉందని అన్నారు.

online news portal

కేసీఆర్ లో భగవంతుడి అవతారాన్ని చూసుకున్నామని చాలా మంది అమ్మాయిలు నాతో అన్నారని… రాముడు, కృష్ణుడు కన్నా కేసీఆరే శృంగార పురుషుడిగా కనపడుతారు అని వర్మ ట్వీట్ చేశారు. అతిపెద్ద కేసీఆర్ విగ్రహాలు, హోర్డింగ్ లతో హైదరాబాద్ పట్టణం సుందరంగా ఉంటుంది అని ఓ కాలేజి అమ్మాయి తనతో అన్నట్టు వర్మ మరో ట్విట్ లో పేర్కోన్నారు. కేసీఆర్ ను మహిళలు ప్రేమించడం విషయంపై తనకు ఆశ్చర్యం కలిగించిందని గతంలో ట్విట్ చేశారు.

కేసీఆర్ చాలా బాగా పనిచేస్తున్నారని, ఆయన బాల్ థాక్రే, మహాత్మాగాంధీలను మించి పనిచేస్తున్నారని, కేసీఆర్ ను చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా నేర్చుకోవాల్సిఉందని ట్వీటేశారు. పనిలోపనిగా తాను హైదరాబాద్ లోనే పుట్టిపెరిగానని, తాను తెలంగాణవాడినని వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.

online news portal

- Advertisement -