భూవివాదాలను పరిష్కరిస్తాం:కేటీఆర్

227
ktr reviews lb nagar Land Issues
Dy CM Mahmood Ali and MA&UD Minister KTR held a meeting on revenue issues in residential colonies of LB Nagar Assembly Constituency today.
- Advertisement -

ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని భూ వివాదాలను కొలిక్కి తెస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై అధికారులు, రెసిడెన్షియల్ కాలనీల ప్రముఖులతో రివ్యూ నిర్వహించిన కేటీఆర్ సాహెబ్‌నగర్‌లో సర్వే నంబర్ 71కి చెందిన వివాదాలపై వక్ఫ్ అధికారులతో చర్చిస్తామని..డిప్యూటీ సీఎం మహముద్ అలీ ఆధ్వర్యంలో త్వరలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

మన్సూరాబాద్‌లోని సర్వే నంబర్ 44, 45లోని భూముల్లో నిర్మాణాల క్రమబద్దీకరణ అంశం పరిశీలిస్తాంమని తెలిపారు. నిర్మాణాలకు 2007లో ఉన్న రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రెస్ కాలనీ, వాంబె కాలనీల్లో ఇప్పటికీ క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోని వారికి జీవో నెంబర్ 58,59 ద్వారా మరో అవకాశం ఇస్తామన్నారు.

ktr lb nagarహస్తినాపురం, జనార్ధన్‌రెడ్డి కాలనీల్లో ఫ్రీడం ఫైటర్స్ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని….ప్రతీ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చెరువుల ఎఫ్‌టీఎల్, కన్జర్వేషన్ జోన్‌లలో ఉన్న వివాదాలపై జోక్యం చేసుకోమని చెప్పిన కేటీఆర్….గ్రీన్‌పార్క్ కాలనీలో క్రీడా సముదాయం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్‌కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -