ఇద్దరు కొడుకులతో యంగ్‌ టైగర్‌..

233
Jr NTR

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ గత వారంలో జన్మించిన తన రెండో కుమారుడిని తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశాడు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచిన ఎన్టీఆర్ తొలి పోస్టుగా తన చిన్న కుమారుడి ఫోటోను షేర్‌ చేశాడు, ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అభయ్ రామ్ తన చేతుల్లో తమ్ముడిని ఎత్తుకుని ఓ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎన్టీఆర్ తన స్మార్ట్ ఫోన్ లో దాన్ని చిత్రీకరిస్తున్నట్టు ఇందులో చూడవచ్చు.

Jr NTR

గతంలో అల్లు అర్జున్ తన కూతురి మొదటి పుట్టిన రోజు కోసం ఎంచుకున్నట్లు ఇప్పుడు తారక్ కూడా తన రెండవ కుమారుడు జన్మించిన సందర్బంగా ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ షేర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేలల్లో లైక్స్ వచ్చాయి.

ఇక ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో అరవింద సమేత అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా దసరాకు ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఓవైపు సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు.